మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో ఉన్న కొన్ని చిత్రాలను లలిత్ మోడీ తన సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకున్నారు. తొలి ట్వీట్లో సుస్మితను తన 'బెటర్ హాఫ్'గా అభివర్ణించాడు. అయితే.. ఆ తర్వాత తన నెక్ట్స్ ట్వీట్లో, ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదని.. డేటింగ్ లో ఉన్నామని స్పష్టం చేశాడు. (Instagram)
లలిత్ మోదీ తన తల్లి స్నేహితురాలు మీనాల్ను 1991లో వివాహం చేసుకున్నారు. లలిత్ మోదీ కంటే మినాల్ 9 ఏళ్లు పెద్ద. మినాల్‌కు గతంలో నైజీరియన్ వ్యక్తితో వివాహమైంది. అయితే, ఆ తర్వాత ఆ వ్యక్తితో విడాకులు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో లలిత్ మోదీ పరారీలో ఉన్నారు. 2010లో దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో నివసిస్తున్నాడు. (Instagram)