మెగా వేలంలో పలువురు టీమిండియా స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరి కోసం వేలంలో జట్ల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి భారత ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
ఇక మిగతావారి కనీస ధర ఒక కోటి కంటే తక్కువగా ఉంది. ఈ లిస్ట్ లో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు. అయితే గతకొంత కాలంగా క్రికెట్ ఆడని ఈ క్రీడా మంత్రిని ఏ ప్రాంచైజీ అన్న తీసుకుంటుందో లేదో చూడాలి.
36 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. తివారీ 98 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 7 అర్ధ సెంచరీలతో 1695 పరుగులు చేశారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం క్యాపిటల్స్), కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ మరియు పంజాబ్ కింగ్స్‌లకు అతడు ప్రాతినిధ్యం వహించారు. తివారీ చివరిసారిగా ఐపీఎల్ 2018లో పంజాబ్ తరఫున ఆడారు. ఐపీఎల్ 2020 వేలంలో తివారీని ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు.