ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన పీలే 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా చరిత్రలో మిగిలిపోయాడు పీలే. ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టి మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంలో పీలేకి మించినవారు లేరు. (PC : AP)
1940 అక్లోబరు 23న జన్మించిన పీలే అసలు పేరు ఎడ్సన్ అరెంటస్ డొ నసిమెంటో. అతడి తండ్రి డాండినో కూడా ఫుట్‌బాలర్ కావడంతో పీలే జీన్స్‌లోనే ఈ ఆట ఉంది. బౌరు పట్టణంలో పెరిగిన పీలే పేదరికాన్ని అధిగమించేందుకు చిన్నతనంలో చాయ్ దుకాణంలో సర్వర్‌గా పనిచేశాడు. తండ్రి తొలి కోచ్‌గా అనంతరం వాల్డెమార్ డి బ్రిటో శిక్షణలో రాటుదేలాడు పీలే. (PC : AP)
ఆ ఏడాది సావోపోలో క్లబ్ శాంటోస్, నైజీరియాకు చెందిన స్టేషనరీ స్టోర్స్ ఎఫ్‌సీ మధ్య ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. కానీ నైజీరియాలో ఆ సమయంలో భీకరమైన అంతర్యుద్ధం జరుగుతోంది. కానీ పీలే మ్యాచ్ చూసేందుకు రెండు వర్గాలు 48 గంటలపాటు యుద్ధానికి విరామం ప్రకటించడం పీలే ఆటకున్న ఆదరణను తెలియజేస్తుంది. (PC : AP)
ఇక 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ‘అథ్లెట్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు అందుకున్నాడు పీలే. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ వరల్డ్ అండ్ స్టాటిస్టిక్స్ ‘వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు ను అందించింది. ఇక 2000 ఏడాదిలో డీగో మారడోనాతో కలిసి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ అవార్డు కూడా దక్కించుకున్నాడు పీలే. (PC : AP)