ఆ తర్వాత అసాధారణ రీతిలో బంతిని డ్రిబిల్ చేసుకుంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్లందరినీ తప్పించుకుంటూ మారడోనా మరో గోల్ నమోదు చేశాడు. హెడర్‌లో కాస్త దేవుడి హస్తం ఉందంటూ మ్యాచ్ అనంతరం మారడోనా పేర్కొనడం సంచలనం రేపింది. ఫుట్‌బాల్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మారడోనా 2020 నవంబరులో కన్నుమూశారు.