నెల రోజుల పాటు ఖతర్ (Qatar) వేదికగా జరిగిన ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA Fooball World Cup) 2022 ముగిసింది. గత ఆదివారం జరిగిన ఫైనల్లో లియోనెల్ మెస్సి (Lionel Messi) నాయకత్వంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై నెగ్గి 36 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. (PC : TWITTER)
ప్రస్తుతం 32 జట్లకు మాత్రమే ఎంట్రీ ఉండగా.. 2026లో ఈ సంఖ్య 48కి చేరనుంది. గ్రూపుకు 3 జట్ల చొప్పున 16 గ్రూపులుగా వీటిని విభజిస్తారు. టాప్ 2లో నిలిచిన మొత్తం 32 జట్లు నాకౌట్స్ కు చేరుకుంటాయి. 2022 ప్రపంచకప్ కోసం ఆసియా నుంచి 5 జట్లు మాత్రమే నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఖతర్ హోస్ట్ హోదాలో అర్హత సాధించింది. (PC : TWITTER)