ఏం స్ట్రాటజీ వేసుకుందో తెలియదు కానీ 64వ నిమిషంలో మెక్సికో జట్టు.. మైదానంలో కొంత వెనకడుగు వేసింది. దీన్ని ఉపయోగించుకున్న అర్జెంటీనా ముందుకు దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే లియోనెల్ మెస్సీ అద్భుతమైన లాంగ్ షాట్‌తో గోల్ చేసి తమ జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ గోల్ తో అర్జెంటీనాకే చెందిన దిగ్గజం డిగో మారడోనా సరసన చేరాడు.
ప్రస్తుతం విజయంతో.. ప్రిక్వార్టర్స్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది అర్దెంటీనా. గ్రూప్-డీలో పోలండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మెక్సికోపై విజయంతో అర్జెంటీనా పాయింట్ల సంఖ్య మూడుకు చేరింది. దీంతో ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది. అర్జెంటీనాపై తొలి పోరులో నెగ్గిన సౌదీ అరేబియా మూడ స్థానంలో ఉండగా.. ఒకే ఒక్క పాయింటుతో మెక్సికో చివరి స్థానంలో ఉంది.