ఆతిథ్య ఖతర్ జట్టు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్ 2-0 గోల్స్ తో గెలిచింది. దీంతో.. ఏడు పాయింట్లతో గ్రూప్ ఏ టాపర్ గా నిలిచింది. (AP Image)
2/ 14
దీంతో.. 11వ సారి ప్రపంచకప్ లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది నెదర్లాండ్స్ జట్టు. నెదర్లాండ్స్ తరఫున కొడి గాస్కో (26వ నిమిషం), ఫ్రాంక్ డి జాంగ్ (49వ నిమిషం) లో గోల్స్ సాధించారు. (AP Image)
3/ 14
నెదర్లాండ్స్ తరఫున కొడి గాస్కో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ టోర్నీలో గాస్కోకి ఇది మూడో గోల్. (AP Image)
4/ 14
మరోవైపు.. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు.. రెండో సారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ - ఏ చివరి లీగ్ మ్యాచులో 2-1 తేడాతో ఈక్వెడార్ జట్టును చిత్తు చేసింది. (AP Image)
5/ 14
దీంతో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ -16కి అర్హత సాధించింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44 వ నిమిషం), కెప్టెన్ కలిదు కులిబాలి (70 వ నిమిషం) లో గోల్స్ సాధించారు. (AP Image)
6/ 14
మూడోసారి ప్రపంచకప్ లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్ కి చేరింది. ఆ తర్వాత మూడు ప్రపంచకప్పుల్లో అర్హత సాధించలేదు. మళ్లీ 2018లో అర్హత సాధించినా.. గ్రూపు దశలోనే ఇంటి దారి పట్టింది. ఈ సారి మాత్రం సత్తా చాటి ప్రిక్వార్టర్స్ కి చేరుకుంది. (AP Image)
7/ 14
ఇక, ఈక్వెడార్ జట్టు ఈ మ్యాచులో పోరాడినా ఫలితం లేకపోయింది. ఈక్వెడార్ జట్టుకు మోజెస్ కైసెడో ( 67 వ నిమిషం) ఏకైక గోల్ అందించాడు. (AP Image)
8/ 14
ఇక.. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. వేల్స్ తో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్ అదరగొట్టింది. అహ్మద్ బిన్ అలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో వేల్స్ ను 3-0 తేడాతో చిత్తు చేసింది. (AP Image)
9/ 14
ఇక, ఈ విజయంతో గ్రూప్ బిలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో సగర్వంగా ప్రిక్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది ఇంగ్లీష్ జట్టు. (AP Image)
10/ 14
మార్కస్ రాష్‌ఫోర్డ్ బ్రేస్ (50 వ నిమిషం, 68 వ నిమిషం) రెండు గోల్స్ తో మెరిశాడు. ఇక, ఫిల్ ఫోడెన్ కూడా 51వ నిమిషంలో గోల్ చేశాడు. (AP Image)
11/ 14
ఇక, ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16లో సెనెగల్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది. గ్రూప్ A.లో సెనెగల్ రెండవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. (AP Image)
12/ 14
మరో మ్యాచులో ఇరాన్ ను చిత్తు చేసి యూఎస్ఏ జట్టు ప్రిక్వార్టర్స్ లోకి అడుగు పెట్టింది. 1-0 గోల్ తేడాతో ఇరాన్ ను చిత్తు చేసింది అమెరికా జట్టు. (AP Image)
13/ 14
ఫస్ట్ హాఫ్ లో క్రిస్టియన్ పులిసిక్ (38 వ నిమిషంలో ) యూఎస్ఏ జట్టుకు మొదటి గోల్ అందించాడు. ఆ తర్వాత రెండో హాఫ్ లో రెండు జట్లు గోల్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. (AP Image)
14/ 14
ఇక, అమెరికా జట్టు.. తమ రౌండ్ -16 మ్యాచులో నెదర్లాండ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. (AP Image)