ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల్ని అలరించడానికి మరో ప్రపంచకప్ రెడీ అయింది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గేమ్ ఫుట్ బాల్. ఖతర్ వేదికగా నవంబర్ 20న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (Fifa World Cup 2022) ఆరంభం కానుంది. డిసెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. క్రికెట్ ప్రపంచకప్ లో కేవలం 16 జట్లు మాత్రమే పాల్గొంటే.. ఫుట్ బాల్ విశ్వ సంగ్రామంలో అందుకు రెట్టింపు అంటే 32 జట్లు తలపడనున్నాయి. (News18 Creative)
ఇక, ఫుట్ బాల్ ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లకి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. గోల్డెన్ షూ అవార్డును 1982 ప్రపంచకప్ లో ప్రారంభించారు. అయితే.. 2010లో దీన్ని గోల్డెన్ బూట్ అవార్డుగా మార్చారు. అయితే, ఇప్పటివరుకు జరిగిన ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన వీరులేవరో ఓ లుక్కేద్దాం. (News18 Creative)