లియోనెల్ మెస్సీ : అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్.. దిగ్గజం లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. టోర్నీ ప్రారంభానికి ముందే.. ఖతార్లో జరిగే ప్రపంచకప్ తన కెరీర్లో చివరి మెగాటోర్నీ అని ప్రకటించాడు. దీంతో.. తన శాయశాక్తులా ఆడటానికి ప్రయత్నిస్తాడు. తన జట్టుకు చివరిసారిగా వరల్డ్ కప్ అందించాలన్న ఉత్సుకతతో ఉన్నాడు. దీంతో, అతడిని చివరిసారిగా ప్రపంచకప్లో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (AP)
క్రిస్టియానో రొనాల్డో : ఈ లెజండ్ ఆట, అతని సామర్థ్యం గురించి అందరికీ బాగా తెలుసు. పోర్చుగల్ జట్టు అతనిపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రతిష్టాత్మక టోర్నీలో రొనాల్డో ఏడు గోల్స్ చేశాడు. పోర్చుగల్ జట్టు FIFA వరల్డ్ కప్ 2022 టైటిల్ గెలవాలనుకుంటే, రొనాల్డో సత్తా చాటాల్సిందే. దీంతో, ఈ ఫుట్ బాల్ మాంత్రికుడిపైనే అందరి చూపు నెలకొంది.(AP)
నెయ్మార్ : లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మాదిరిగానే బ్రెజిల్ జట్టు నెయ్మార్పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రతి మేజర్ టోర్నీలో నేమార్ మార్క్యూ ప్లేయర్. మైదానంలో నెయ్మార్ ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ఆరంభం నుంచి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగానే నెయ్మార్పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. (AP)

హ్యారీ కేన్ : 2018 ఫిఫా ప్రపంచకప్లో ఇంగ్లీష్ ఫుట్బాల్ ఆటగాడు హ్యారీ కేన్ గోల్డెన్ బూట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది కూడా అతని నుంచి అద్భుతమైన ఆటను ఇంగ్లండ్ జట్టు ఆశిస్తోంది. ప్రస్తుతం అతను జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. గత ప్రపంచకప్ లో ఆరు గోల్స్ చేశాడు. దీంతో.. ఈ సారి కూడా హ్యారీ కేన్ ఆట కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. (హ్యారీ కేన్/ఇన్స్టాగ్రామ్)