ఇక.. సెకండాఫ్ లో జూలియన్ అల్వారెజ్ 57వ నిమిషంలో కొట్టిన గోల్ తో.. అర్జెంటీనాకు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాడు. ఇక, ఆట 77 వ నిమిషంలో క్రెయిగ్ గోడ్విన్స్ కొట్టిన షాట్.. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కు తగిలి సెల్ఫ్ గోల్ అవ్వడంతో ఆస్ట్రేలియాకు ఓదార్పు గోల్ దక్కింది. ఆస్ట్రేలియన్లు ఆలస్యంగా దూకుడు ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. మ్యాచును 2-1 తేడాతో అర్జెంటీనా కైవసం చేసుకుంది.