ఉదాహరణకు బ్యాటింగ్ చేసే టీం 10వ ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు చేసిందనుకుందాం. అయితే రెండో పరుగు చేసే క్రమంలో ఫీల్డింగ్ జట్టు ప్లేయర్ ఫేక్ త్రో ద్వారా బ్యాటర్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడనుకుందాం. అప్పుడు అంపైర్లు పూర్తి చేసిన రెండు పరుగలతో పాటు పెనాల్టీ రూపంలో 5 పరుగులను బ్యాటింగ్ జట్టుకు ఇస్తారు. అంతేకాకుండా మూడో బంతిని మళ్లీ వేయిస్తారు. (PC : TWITTER)
ఇక విరాట్ కోహ్లీ ఫేక్ త్రో బ్యాటర్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదు. కోహ్లీ ఫేక్ త్రో చేసిన సమయంలో ఇద్దరు ప్లేయర్లు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా రెండో పరుగును పూర్తి చేసుకున్నారు. అంటే కోహ్లీ ఫేక్ త్రో అటు లిట్టన్ దాస్ ను కానీ.. ఇటు షాంటోని కాని ఎటువంటి ఇబ్బందికి గురి చేయలేదు. ఫలితంగా అంపైర్లు దానిని ఫేక్ త్రోగా డిక్లేర్ చేయలేదు. (PC : TWITTER)
అయితే మ్యాచ్ లో ఓడిన తర్వాత ఫేక్ త్రో చర్చకు బంగ్లా ప్లేయర్లు తెర లేపారు. ఓటమికి సాకుగా ఫేక్ త్రోను చూపిస్తున్నారే తప్ప దాని వల్ల వారు ఓడిపోలేదు. వారు ఓడిపోవడానికి ముఖ్య కారణం వారి మిడిలార్డర్ బ్యాటింగ్. ఒక్కరు కూడా బాధ్యతతో ఆడలేదు. అయితే భారత్ గెలుపును తక్కువ చేసి చూపేలా కామెంట్స్ చేస్తూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.