ఇక రోహిత్ శర్మ పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఫిట్ నెస్ పై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. అలాగే, రోహిత్ కెప్టెన్సీపై కూడా మాజీ క్రికెటర్లు ఫైరవుతున్నారు.ఇప్పుడు ఆ లిస్టులోకి టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ చేరిపోయాడు. రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు అతుల్. 'భారత జట్టు అడిలైడ్‌లో బ్యాటింగ్ చేస్తే.. ఇంగ్లండ్ టీం మాత్రం షార్జాలో ఆడినట్లు కనిపించింది' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే, టీమిండియా జట్టులో ప్రక్షాళన చేయడానికి బీసీసీఐ రెడీ అయింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే రెడీ చేయాలి. జట్టులో భారీ మార్పులు చేయాల్సిన తరుణం. యువకులను ప్రయత్నించాల్సి ఉంది. సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లకు అవకాశాలు ఇవ్వాల్సి ఉంది.
ముఖ్యంగా మిడిలార్డర్ లో నమ్మకంగా ఆడే లెఫ్టాండ్ బ్యాటర్ ను రెడీ చేయాలి. గతంలో ఈ బాధ్యతను యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు చక్కగా నిర్వహించారు. ప్రస్తుతం తిలక్ వర్మ రూపంలో టీమిండియాకు చక్కటి ఆప్షన్ ఉంది. తిలక్ వర్మ వయసు 20 ఏళ్లే. పంత్ చుట్టు కాకుండా ట్యాలెంట్, టెక్నిక్ ఉన్న తిలక్ వర్మ లాంటి ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి.