అన్ని రంగాల్లోను రాణించే మహిళలు క్రీడల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కేవలం పురుషుల మాత్రమే ఆడే ఆటల్లో కూడా తమ సత్తా చూపిస్తున్నారు. దేంట్లోనూ మేం తీసుపోం అంటున్నారు. ఆకాశంలో కూడా గెలుపు సంతకాలు చేస్తున్నారు. మహిళల ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో ఇంగ్లండ్ మాజీ మహిళ క్రికెటర్ సారా టేలర్ (Sarah Taylor) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. (Photo Credit : Instagram)
గతంలో సారా టేలర్ తన నగ్నం చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి షాకిచ్చారు. ఆమె నగ్న ఫొటో చూడగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. అందుకు గల కారణాన్ని తెలుసుకున్న తర్వాత అంతా ఆమెను మెచ్చుకున్నారు. ఆ ఫొటోలో సారా పూర్తిగా నగ్నంగా కనిపించింది. చేతికి గ్లౌస్ మాత్రమే ధరించి వికెట్ల వెనుకాల నుంచి స్టంప్ చేస్తున్నట్లు పోజిచ్చింది. (Photo Credit : Instagram)