మూడో టెస్టు రెండో రోజు ట్రెంట్ బౌల్ట్ నేతృత్వంలోని న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడించింది. కివీస్ బౌలర్ల ధాటికి కేవలం 17 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. బెన్ స్టోక్స్ ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు మాత్రమే చేసి నీల్ వాగ్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే, ఈ మ్యాచులో స్టోక్స్ తన టెస్టు కెరీర్లో 100వ సిక్సర్ కొట్టాడు. (PC- England cricket twitter)
టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఈ ఘనత సాధించారు. మెకల్లమ్ 176 ఇన్నింగ్స్‌ల్లో 107 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, గిల్‌క్రిస్ట్ 137 ఇన్నింగ్స్‌ల్లో వంద సిక్సర్లు కొట్టాడు. (AFP)