ఇంగ్లండ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ సారా గ్లెన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల ముప్పుతిప్పలు పెడుతుంది. అంతేకాదు.. ఆమె తన అందంతో అభిమానుల హృదయాలను కూడా శాసిస్తుంది. సారా 2019లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసింది. ఆమె 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్‌లో ఆడింది. ఇక.. అదే ఏడాది ICC T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చింది. సెప్టెంబర్ 2022లో ICC T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సారా 2వ స్థానంలో ఉంది. (Sarah Glenn/Instagram)
సారా గ్లెన్ 27 ఆగస్టు 1999న డెర్బీలో జన్మించింది. ఇంటి దగ్గరే తన చిన్ననాటి విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ట్రెంట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. ఇక్కడ బాయ్స్ ఫస్ట్ XI కోసం క్రికెట్ ఆడింది. అంతేకాకుండా... గ్లెన్ జూనియర్ ఇంటర్నేషనల్స్‌లో హాకీ కూడా ఆడింది. గ్లెన్ 2013 మహిళల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డెర్బీషైర్ తరపున అరంగేట్రం చేసింది. (Sarah Glenn/Instagram)
23 ఏళ్ల సారా గ్లెన్ మిగతా మహిళా క్రికెటర్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు ధరించడం.. నెయిల్ ఆర్ట్.. అలాగే ఫ్యాషన్ విషయంలో సారా తగ్గేదే లే అంటుంది. బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ, "క్రికెట్లో ఇది సాధారణం కాకపోవచ్చు, కానీ నేను దీన్ని చేయాలనుకుంటున్నాను." అని తనకు ఫ్యాషన్ పట్ల ఉన్న మక్కువను తెలిపింది.(Sarah Glenn/Instagram)
సారా గ్లెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బాగా పాపులర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ క్రికెట్ బ్యూటీకి లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన ఆకర్షణీయమైన మరియు హాట్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. ఈ ఫోటోలకు లైకుల వర్షం కురుస్తుంది. ఫ్యాన్స్ కూడా ఆమె ఫ్యాషన్ సెన్స్ కు ఫిదా అయ్యారు. (Sarah Glenn/Instagram)