ENGLAND CRICKETERS WEAR T SHIRTS WITH SLOGANS WHY THEY WEAR THAT BLACK T SHIRTS CHECK HERE JNK
England Cricketers: ఇంగ్లాండ్ క్రికెటర్లు నల్లని టీషర్ట్స్ ఎందుకు ధరించారు? దాని వెనుక ప్రత్యేక కారణం ఉందా?
మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన చేసే సమయంలో ఇంగ్లాండ్ జట్టు క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్ బ్లాక్ కలర్ టీషర్ట్స్‌లో కనిపించారు. ఎందుకు ఇలా నల్లటి దుస్తుల్లో కనిపించారంటే..
లీడ్స్‌లో మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఇండియా-ఇంగ్లాండ్ జట్ల జాతీయ గీతాలను ఆలపించారు. ఆ సమయంలో మైదానంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నల్లని టీషర్ట్స్ దరించి కనపడ్డారు. ఇంతకు వాళ్లు అలా నల్లని టీషర్ట్స్ ఎందుకు వేసుకున్నారు?
2/ 5
ఇంగ్లాండ్ క్రికెటర్లే కాకుండా సపోర్ట్స్ స్టాఫ్ కూడా నల్లని టీషర్ట్స్ ధరించి కనపడ్డారు. ఆ టీ షర్ట్స్పై 'వీ స్టాండ్ టుగెదర్ ఎగనెస్ట్ ఎబ్లియిజమ్/హిమోఫోబియా/ట్రాన్స్‌ఫోబియా' అని రాసి ఉన్నది. (AFP Photo)
3/ 5
అండర్సన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్ టీ షర్టులపై జాతి వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్నాయి. (AFP Photo)
4/ 5
క్రికెటర్ల ద్వారా పలు వివక్షలపై అవగాహన కల్పించేందుకే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇలా టీషర్టులపై నినాదాలు రాయించినట్లు తెలుస్తున్నది. గతంలో కూడా ఇంగ్లీష్ క్రికెటర్లు పలు వివక్షలకు వ్యతిరేకంగా స్ట్రాంగ్ మెసేజీలు ఇచ్చారు. (AFP Photo)
5/ 5
ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ కూడా ఇటీవల తాను చూసిన వివక్ష సంఘటనను మీడియాతోపంచుకున్నాడు. తన స్నేహితుడైన అజీమ్ రఫీక్ వివక్ష కారణంగా ఎంత క్షోభను అనుభవించాడో చెప్పాడు. ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్ తరపున ఆడుతున్న సమయంలో రఫీక్ చాలా వివక్షకు గురైనట్లు రూట్ చెప్పాడు. (AFP Photo)