ఈ ఓటమితో శ్రీలంక వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అత్యధిక వన్డేలు ఓడిపోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటి వరకు 860 వన్డే మ్యాచ్లు ఆడిన శ్రీలంక 390 విజయాలు సాధించి, 428 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 5 మ్యాచ్లు టై అవ్వగా.. 37 మ్యాచ్లు ఫలితం తేలలేదు. శ్రీలంక తర్వాత 427 పరాజయాలతో భారత్ ఉంది. అయితే వన్డే క్రికెట్లోనే అత్యధికంగా 993 మ్యాచ్లు ఆడింది భారతే. ఇందులో 516 విజయాలు టీమిండియా సొంతమవ్వగా... 9 మ్యాచ్లు టై అయ్యాయి. 41 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా కొనసాగుతోంది. 955 మ్యాచ్లు ఆడిన ఆసీస్.. 579 విజయాలు సాధించింది. 333 మ్యాచ్లు ఓడిపోగా... 9 మ్యాచ్లు టై అయ్యాయి. మరో 34 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.