ఇక రెండో రోజు ఆటలో భారత్ 145 పరుగులకు ఆలౌట్ కాగా.. 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఈసారి 81 పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా భారత్ ముందు 48 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఛేదనకు దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేజ్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.