ENG vs IND : టీమిండియాను వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. ఆ నలుగురికి కూడా పాజిటివ్..

ENG vs IND : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును కరోనా వైరస్ మహమ్మారి వ‌ణికిస్తోంది. మన దేశంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా వేరియెంట్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టులోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్ రాగా..మరో నలుగురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.