Home » photogallery » sports » ELOISE SHERIDAN AND CLAIRE POLOSAK TO BE THE FIRST WOMEN DUO FIELD UMPIRES IN WBBL4

WBBL: ఆడవాళ్లే అంపైర్స్...మహిళల బిగ్ బాష్ లీగ్‌లో న్యూ ట్రెండ్

ఆస్ట్రేలియన్ ట్వంటీ ట్వంటీ లీగ్...మహిళల బిగ్ బాష్ లీగ్‌లో న్యూ ట్రెండ్ స్టార్ట్ కాబోతుంది. క్రికెట్ మ్యాచ్‌ల్లో మహిళా అంపైర్లుండటం కొత్తేమీ కాదు. తొలిసారిగా ఇద్దరు మహిళలు ఓ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియాకే చెందిన ఎలోయిస్ ష్రీడన్, క్లెయిరీ పోలోసాక్ ఆ అరుదైన రికార్డ్ నమోదు చేయబోతున్నారు. డిసెంబర్ 23న అడిలైడ్ స్ట్రైకర్స్ , మెల్‌‌బోర్స్ స్టార్స్ జట్ల మద్య అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగబోతున్న మ్యాచ్‌కు ఈ ఇద్దరు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.