2018 నుంచి 2022 వరకూ అయిదేళ్ల కాలానికి గాను గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్ ఇండియా.. ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే టీవీ, డిజిటల్ ప్రసార హక్కులకు కలిపి రూ. 35-40 వేల కోట్ల ధర పలకవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐకి కాసుల వర్షం కురవనుంది.
గతంలో మ్యాచ్కు రూ.54.5 కోట్లు చెల్లించేలా స్టార్ ఇండియా ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు వచ్చే సీజన్లలో మ్యాచ్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు అవి కూడా పోటీపడే ఆస్కారముంది. వాటి మధ్య పోటీ కూడా ఈ రేటు పెరిగేందుకు ఓ కారణం.