స్మృతి మంధానకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆటతో పాటు అందం కూడా ఉన్న మంధానకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (Image Credit : Instagram)
పురుషాధిక్య క్రికెట్ సమాజంలో కూడా స్మృతి మంధానకి ఎనలేని క్రేజ్ ఉంది . 1996 జూలై 18 న స్మృతి జన్మించింది. అయితే ఆమెకు ఆ బాలీవుడ్ హీరో అంటే క్రష్ అంట. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. (Image Credit : Instagram)
వుమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో కన్పించినందుకు మరికొంత మొత్తం లభిస్తుంది. క్రికెటర్గా వచ్చే ఈ రాబడి కాకుండా.. మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో "ఎస్.ఎం.18" అని ఆమె ఒక కేఫ్ నడుపుతున్నారు. స్మృతి తలపైకి లాభాల గంపను ఎత్తుతున్న ఆమె తొలి వెంచర్ అది. ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది. (Image Credit : Instagram)
ఇంగ్లాండ్తో డ్రాగా ముగిసిన ఏకైక టెస్టులో అర్ద సెంచరీతో అదరగొట్టిన స్మృతి ఇప్పుడు యువతకు హాట్ టాపిక్ గా మారింది. ఆ మ్యాచ్కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్గా మారింది. జుట్టును ముడి వేసుకుంటున్న ఆ ఫోటోకు ఒక అభిమాని 'సడెన్గా చూసి తాప్సి పన్ను అనుకున్నా' అనే కామెంట్ చేశాడు ఓ నెటిజన్. (Image Credit : Instagram)