చంద్రుడి మీదకు రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. ఇంట్లో పెంపకం నుంచి మొదలుకొని చదువు, ఉద్యోగం.. ఇలా అన్ని చోట్ల ఆమెపై చిన్నచూపే చూస్తోంది నేటి సమాజం. ఐతే వీటన్నింటినీ దాటుకొని ఎంతో మంది వనితలు చరిత్ర సృష్టించారు. ఉన్నత స్థానాలను అధిరోహించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. వారిలో ఒకరు సానియా మీర్జా (Sania Mirza).
ఇలాంటి తరహా విమర్శలు రావడం సానియా కెరీర్లో ఇదే మొదటిసారి కాదు. భారతీయ ప్రజలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే త్రివర్ణ పతాకాన్ని సైతం సానియా అగౌరపరిచిందంటూ అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే మక్కా మసీదులో వాణిజ్యం షూటింగ్ నిర్వహించి ముస్లిం పెద్దల ఆగ్రహానికి గురైంది.
19 ఏళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. ఒకరకంగా భారత మహిళల టెన్నిస్ కు ముఖచిత్రంగా ఉంది. 2003లో టెన్నిస్ రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ.. కెరీర్ ఆరంభంలో సింగిల్స్ లో మెరిసినా తర్వాత డబుల్స్ కే పరిమితమైంది. సింగిల్స్ లో 2007 మిడ్ సీజన్ లో ఆమె ప్రపంచ మహిళల ర్యాకింగ్స్ లో 27 వ స్థానానికి చేరింది. సింగిల్స్ కెరీర్ లో ఆమెకు అదే ఉత్తమ ర్యాంకు.