PICS : స్పోర్ట్స్ స్టార్స్ దీపావళీ సంబరాలు అంబరాన్నంటాయి

భారత క్రీడాకారులు, క్రికెటర్ల దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెటర్లు, బ్యాడ్మింటన్ స్టార్స్, రెజర్లు, ఈ సారి దివాళీని ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సతీమణి అనుష్క శర్మతో కలిసి దీవాళీ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ దీపావళికి డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిశారు.