Utter Flop: ఇదేం ఆట మావా..! ఇలా ఆడితే కష్టమే భయ్యా
Utter Flop: ఇదేం ఆట మావా..! ఇలా ఆడితే కష్టమే భయ్యా
Utter Flop: ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.! గత 12 టీ20 మ్యాచ్‌ల్లో ఇదే పరిస్థతి. అయినా అతడిని టీమ్‌లో ఎందుకు ఆడిస్తున్నారో తెలియని దుస్థితి.! వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టినా టీ20లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు జార్ఖండ్ చిన్నోడు ఇషాన్ కిషాన్. ఇలా ఆడితే టీ20 టీమ్‌లో అతని స్థానం గల్లంతేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత 12 టీ20ల్లో అట్టర్ ఫ్లాప్ షో. ఒక్కటంటే ఒక్క చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ లేదు. చివరి 12 మ్యాచ్‌ల్లో అతడి టాప్ స్కోర్ కేవలం 37పరుగులు. ఇవి భారత్ యువ ఓపెనర్ ఇషాన్ కిషాన్ గణాంకాలు.
2/ 7
టీ20ల్లో ఇషాన్ ఎంత ఫెయిల్ అవుతున్నా టీమ్‌లో అతడినే కొనసాగించడంపై ఓవైపు విమర్శలు పెరుగుతుండగా.. సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ఇషాన్ తన స్కోర్లను భారీ స్కోర్లుగా మార్చుకోవాలని ఈ వెటరన్ అభిప్రాయపడ్డాడు. Image source Ishan kishan twitter
3/ 7
కివీస్‌తో జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యాడు ఇషాన్. కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. Image credits OneCricket
4/ 7
న్యూజిలాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టీ20ల్లో ఇషాన్ కిషన్ రాణించాలని కార్తీక్ కోరుకుంటున్నాడు. లేకపోతే టీ20 జట్టులో ఇషాన్ స్థానం గల్లంతయ్యే ప్రమాదముందన్నాడు.
5/ 7
గత 10టీ20 ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 122పరుగులే చేశాడు. అంటే అతని యావరేజ్ కేవలం 12.2 మాత్రమే. Image Credits Sportskeeda
6/ 7
ఇక గతేడాది జూన్‌లో వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా ఇషాన్ హాఫ్ సెంచరీ కొట్టాడు.
7/ 7
గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే టీ20 ఫార్మాట్ వేరు, వన్డే ఫార్మాట్ వేరు. ఆ ఒక్క డబుల్ సెంచరీ సాకుతో టీ20ల్లో ఇషాన్‌కు అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Image Credits CricTracker