పెద్ద పెద్ద మీసాలతో ప్రత్యర్థులను తన పదునైన బౌన్సర్లతో బెంబేలెత్తించే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో జాన్సన్ జగడం ప్రతి క్రికెట్ అభిమానికి కూడా గుర్తుండే ఉంటుంది. అయితే జాన్సన్ క్రికెటర్ కంటే ముందు జీవితం గురించి తెలుసుకుంటే మీరు అవాక్కవ్వడం ఖాయం. అతడు ట్రక్ డ్రైవర్ గా, ప్లంబర్ గా పనిచేశాడు.
2019లో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్ లో అనూహ్యంగా స్టీవ్ స్మిత్ కు కంకషన్ సబ్ స్టిట్యూట్ గా బ్యాటింగ్ కు వచ్చిన లబుషేన్ తన ఆటతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి కూడా లబుషేన్ అద్భుత ఆటతీరుతో టెస్టుల్లో ఆ జట్టుకు మూల స్థంభంగా మారిపోయాడు. అయితే లబుషేన్ క్రికెటర్ కాకముందు చానెల్ 9 న్యూస్ చానెల్ కు కెమెరా మ్యాన్ గా పని చేశాడు.
అటు బంతితో ఇటు యాక్టింగ్ తో అదరగొట్టే టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ లో ఎవరికీ తెలియని ఓ ట్యాలెంట్ దాగి ఉంది. యుజువేంద్ర చహల్ క్రికెట్ తో పాటు చెస్ కూడా బాగా ఆడగలడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోక ముందు యుజువేంద్ర చహల్ యూత్ లెవెల్ లో చెస్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఒక వేళ చహల్ క్రికెటర్ కాకపోయి ఉంటే చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యేవాడేమో
దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డీవిలియర్స్ క్రికెట్ లో మిస్టర్ 360గా సుపరిచితుడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడగలిగే సామర్థ్యం డీవిలియర్స్ కు ఉండటంతో అతడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారు. అయితే డీవిలియర్స్ ఒక్క క్రికెట్ లోనే కాదు స్పోర్ట్స్ లోనే మిస్టర్ 360. క్రికెటర్ గా మారడానికంటే ముందు డీవిలియర్స్ అండర్ 19 బ్యాడ్మింటన్ చాంపియన్. అలాగే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్, హాకీ జట్లకు నిర్వహించిన ట్రయిల్స్ లో పాల్గొని సెలెక్ట్ కూడా అయ్యాడు. అయితే చివరకు క్రికెట్ ను ఎంచుకొని సూపర్ సక్సెస్ అయ్యాడు.