భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై 1968 జులై 16న మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. 1990ల్లో క్రికెట్లో సచిన్ టెండుల్కర్, టెన్నిస్‌లో లియాండర్ పేస్, హాకీలో ధన్‌రాజ్ పిళ్లై మంచి ఫామ్‌లో ఉన్నారు. పిళ్లై ప్రయాణం చాలా ఇబ్బందులతో ప్రారంభమైంది. అతడు పూణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్టాఫ్ కాలనీలో గడిపాడు. అక్కడి మైదానంలో పిళ్లై సంరక్షకుడిగా ఉండేవాడు. అప్పుడే విరిగిన హాకీ కర్రలతో ఆటను ప్రాక్టీస్ చేశాడు. (Twitter)
ధన్‌రాజ్ పిళ్లై కుటుంబంలో నాలుగవ సంతానం. అతని బాల్యం కడు పేదరికంలో గడిచింది. తమిళనాడుకు చెందిన ఆ కుటుంబం.. పూణేలు వలస వచ్చింది. అక్కడే ధన్‌రాజ్ పుట్టాడు. హాకీ స్టిక్ కూడా కొనడానికి డబ్బులు లేనంత దీన స్థితిలో ధన్‌రాజ్ కుటుంబం ఉండేది. అతడి ద్వారా అయినా కుటుంబానికి డబ్బు వస్తుందని ధన్‌రాజ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో అదే నిజమయ్యింది. (Twitter)
ధనరాజ్ పిళ్లై నాలుగు ఒలింపిక్స్ (1992, 1996, 2000, 2004), నాలుగు వరల్డ్ కప్‌లు (1990, 1994, 1998, 2002), నాలుగు చాంపియన్స్ ట్రోఫీలు (1995, 1996, 2002, 2003), నాలుగు ఆసియా క్రీడలు (1990, 1994, 1998, 2002) తన ఖాతాలో ఉన్నాయి. ఇన్ని మెగా ఈవెంట్లలో పాల్గొన్న ఏకైక హాకీ ప్లేయర్ ప్రపంచంలో ధన్‌రాజ్ పిళ్లై ఒక్కడే. (Twitter)