టీమిండియా వికెట్ కీపర్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) మోసగాళ్ల బారిన పడ్డాడు. . ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాల రూ.1.63 కోట్లు నష్టపోయాడు. విలాసవంతమైన వాచీలు చౌకధరకు లభిస్తాయని నమ్మబలకడంతో ఆశ పడ్డాడు. కానీ ఈ విలాసవంతమైన వాచీల ఆశతో రూ.1.63 కోట్లు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనవరి 2021లో మ్రినాంక్ సింగ్, రిషభ్ పంత్‌తో పాటు అతని మేనేజర్ పునీత్ సోలంకిని కలిశాడు. తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యూవెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని నమ్మబలికాడు. తాను చాలామంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు చూపించాడు.
పాత వాచీలు ఎక్కవ ధరకు అమ్మిబెట్టి, తక్కువ ధరకు వాచీలు ఇప్పిస్తానని మృణాక్ సింగ్ చెప్పిన మాటలను నమ్మిన రిషబ్ పంత్, సోలంకి... అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని బంగారు నగలను అందించారు. ఫిబ్రవరిలో వాటిని రిషభ్ పంత్ నుంచి రీసేల్ కోసం కొనుగోలు చేసినట్టుగా రూ.1.63 కోట్లకు మృణాక్ సింగ్ చెక్కు ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావడంతో మ్రినాంక్ పై రిషభ్ పంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్ ఇంతకుముందు మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రూ.6 లక్షలకు బిజినెస్ మ్యాన్‌ను మోసం చేసినందుకు ప్రస్తుతం ముంబై ఆర్టూర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఒక సినిమా డైరెక్టర్‌ను మోసగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు.