థానేలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. నర్మదా నది వద్ద పూజ చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ముంబైలో వర్షంలో చిన్నారుల ఆనందపరవశం. ఫిఫా 2018 ఫీవర్ భారత్‌కు కూడా వ్యాపించింది. కోల్‌కతాలో తీపి పదార్థాలతో ఫిఫా మాదిరి కప్‌ను తయారు చేస్తున్న ఓ స్వీట్ స్టా్ల్ కార్మికుడు. ఫిఫా వరల్డ్ కప్ 2018ను అర్జెంటీనా జట్టు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్న భారత్‌లోని ఆ దేశ అభిమానులు. యూపీలో కొత్త బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. యోగా గురువు బాబా రాందేవ్‌తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ. సింగపూర్‌లోని కెపెల్లా హోటల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ చారిత్రక భేటి. భారత్-ఆఫ్ఘన్ మధ్య క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెంగుళూరులో ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఆఫ్ఘన్ ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్న దివ్యాంగుడు.