CSK vs GT : ధోని ఈ ప్లేయింగ్ ఎలెవెన్ తో బరిలోకి దిగితే హార్దిక్ పాండ్యాకు చుక్కలే!
CSK vs GT : ధోని ఈ ప్లేయింగ్ ఎలెవెన్ తో బరిలోకి దిగితే హార్దిక్ పాండ్యాకు చుక్కలే!
CSK vs GT : ఆరంభపోరుతోనే ఐపీఎల్ కు ఊపు రానుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ఐపీఎల్ (IPL 2023) 2023 సీజన్ కోసం రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. మార్చి 31న ఆరంభమయ్యే ఐపీఎల్ రెండు నెలల పాటు ప్రేక్షకులను అలరించనుంది.
2/ 8
ఆరంభపోరుతోనే ఐపీఎల్ కు ఊపు రానుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
3/ 8
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అదే సమయంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా చాంపియన్ గా నిలబడింది. మరోసారి అటువంటి ప్రదర్శనను రిపీట్ చేయాలని గుజరాత్ టైటాన్స్ పట్టుదలగా ఉంది.
4/ 8
ఇక అదే సమయంలో ఈసారి ఐపీఎల్ లో ధోని తన కెప్టెన్సీ మ్యాజిక్ ను మరోసారి అందరికీ రుచి చూపించాలనే పట్టుదలగా ఉన్నాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తన చివరి ఐపీఎల్ ను కప్పుతో ముగించాలనే సంకల్పంతో ధోని ఉన్నాడు.
5/ 8
ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగే తొలి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్ విషయంలో ధోని తన మార్కును ప్రదర్శించాడు. పక్కా టీంతో బరిలోకి దిగుతున్నాడు.
6/ 8
ఓపెనర్లుగా డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లు ఉంటారు. వన్ డౌన్ లో బెన్ స్టోక్స్ బరిలోకి దిగే అవకాశం. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన నాలుగో స్థానంలో తెలుగు ప్లేయర్ అంబటి రాయుడు బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
7/ 8
ఆ తర్వాత మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే లు వచ్చే అవకాశం ఉంది. ధోని 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే పరిస్థితులకు తగ్గట్లు ఈ బ్యాటింగ్ స్థానాలు మారే అవకాశం కూడా ఉంది.
8/ 8
ఇక బౌలర్లుగా దీపక్ చహర్, ముఖేశ్ చౌదరి, మహీశ్ తీక్షణలు బరిలోకి దిగనున్నారు. వీరికి తోడు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లు కూడా బౌలింగ్ చేయగలరు. ఇదే టీంతో టోర్నీ మొత్తం బరిలోకి దిగేందుకు ధోని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.