CSK vs GT : సీఎస్కేతో మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ ఆడటం లేదు
CSK vs GT : సీఎస్కేతో మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ ఆడటం లేదు
CSK vs GT : ఇరు జట్లు కూడా విజయంపై కన్నేశాయి. తొలి మ్యాచ్ లో గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఆరంభ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి.
ధనాధన్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 2023 మరికాసేపట్లో ఆరంభం కానుంది. తొలి సమరం గురుశిష్యులు అయిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మధ్యే జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT)లు తలపడనున్నాయి.
2/ 7
ఇరు జట్లు కూడా విజయంపై కన్నేశాయి. తొలి మ్యాచ్ లో గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఆరంభ పోరులో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి.
3/ 7
బలాబలాల విషయానికి వస్తే ఇరు జట్లు కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బౌలింగ్ విషయంలో గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కంటే కూడా మెరుగ్గా కనిపిస్తుంది. ఇక గత సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరగ్గా రెండింటిలోనూ గుజరాత్ టైటాన్స్ జట్టే గెలిచింది.
4/ 7
అయితే చెన్నైతో జరిగే ఆరంభ పోరులో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఆడటం లేదు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఫినిషర్ రోల్ లో మిల్లర్ అద్భుత ప్రదర్శన చేశాడు. గుజరాత్ కు టైటిల్ అందించడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు.
5/ 7
ప్రస్తుతం దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఏప్రిల్ 2న పూర్తి కానుంది. దాంతో సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే మిల్లర్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉండనున్నాడు.
6/ 7
డేవిడ్ మిల్లర్ తో పాటు ఎయిడెన్ మార్క్రమ్ (సన్ రైజర్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్ రైజర్స్), మార్కో యాన్సెన్ (సన్ రైజర్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబడ (పంజాబ్), నోకియా (ఢిల్లీ) తమ ఫ్రాంచైజీలు ఆడే తొలి మ్యాచ్ లకు దూరమయ్యారు.
7/ 7
సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరగనుంది. చివరిదైన మూడో వన్డే ఆదివారం జరగనుంది. అనంతరం సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ కోసం భారత్ కు రానున్నారు.