టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గత ఏడాది అగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా ఆడకుండా ధోని అకస్మాత్తుగా క్రికెట్ నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఆ తర్వాత ధోనీ ఫేర్వెల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. ఇక ధోనీ ఇంకా ఐపీఎల్ ఆడుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆ విషయాన్ని అప్పట్లో మర్చిపోయారు. (PC: IPL)
కరోనా కారణంగా 2020 సీజన్ ఇండియాలో జరగలేదు. ఇక 2021లో తొలి దశలో ఇండియాలో మ్యాచ్లు నిర్వహించారు. చెన్నైలోని చేపాక్ స్టేడియం కూడా పలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. కానీ న్యూట్రల్ గ్రౌండ్ నిబంధనలతో చెన్నై సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడలేదు. ఇక రెండో దశ మ్యాచ్లు అన్నీ యూఏఈ వేదికగా జరుగుతున్నాయి. దీంతో 2019 నుంచి ధోనీ చెన్నైలో మ్యాచ్లు ఆడలేదు. (PC: IPL)
రాబోయే సీజన్ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్నది. అంతకు ముందే నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. సీఎస్కే జట్టు ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలను తిరిగి తీసుకునే ఆలోచనలో ఉన్నది. అంటే వచ్చే సీజన్లో కూడా ఎంఎస్ ధోనీనే సీఎస్కే జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. (PC: IPL)