క్రిస్టియానో రొనాలో (Cristiano Ronaldo).. ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు అత్యంత ఇష్టపడే వ్యక్తి. దేశాలకు అతీతంగా రొనాల్డోపై విపరీతమైన అభిమానం పెంచుకున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం యూరో కప్ 2021లో పోర్చుగల్ జట్టుకు నడిపిస్తున్న ఈ దిగ్గజ ఫుట్‌బాలర్.. మల్టీ నేషనల్ కంపెనీ కోకాకోలాకు (Coca Cola) తీరని నష్టాన్ని చేకూర్చాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్లో కోకా కోలా బాటిల్స్ తీసి పక్కన పెట్టి.. నీళ్లు తాగండి అంటూ గట్టిగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.
క్రిస్టియానో రొనాల్డో అలా చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. రొనాల్డో దెబ్బకు కోకాకోలా షేర్లు స్టాక్ మార్కెట్లో (Stock Market) 1.6 శాతం మేర నష్టపోయాయి. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కోకాకోలా మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా 238 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒకే రోజు దాదాపు రూ. 29 వేల కోట్ల రూపాయల విలువ ఆవిరై పోయింది. కేవలం క్రిస్టియానో రొనాల్డో చేసిన చిన్న పనికే అంత సంపద (Market Value) ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
గత నెలలో ఎలాన్ మస్క్ చేసిన వరుస ట్వీట్లతో బిట్ కాయిన్ షేర్లు ఒక్కసారిగా తగ్గడం, మరోసారి పెరగడం జరిగాయ్. పర్యావరణం సంరక్షణ దృష్ట్యా బిట్ కాయిన్ పేమెంట్ ను టెస్లా ప్రోత్సాహించడం లేదని మస్క్ ట్వీట్ చేశారు. ఇంకే ముంది.. బిట్ కాయిన్ ఏకంగా 24 గంటల్లో తన వాల్యూలో 15 శాతాన్ని కోల్పోయింది. మళ్లీ పది రోజుల్లో మీరు బిట్ కాయిన్ తో టెస్లా కారులు కొనుగోలు చేయెచ్చని ట్వీట్ చేశారు. దీంతో ఈ సారి బిట్ కాయిన్ వాల్యూ అమాంతం పెరిగింది.
ప్రఖ్యాత బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబోర్న్ జేమ్స్ ట్వీట్ తో ప్రఖ్యాత సెల్ ఫోన్ దిగ్గజం సామ్ సంగ్ అమ్మకాలు అమాంతం పడిపోయాయ్. ఇంతకీ ఏం జరిగిందంటే..జేమ్స్ తన సామ్ సాంగ్ ఫోన్ లోని డేటా మొత్తం ఎరేజ్ అయింది.. దీంతో నా జీవితంలో తొలిసారి చాలా బాధపడుతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. అయితే, వెంటనే పది నిమిషాల్లో ఆ ట్వీట్ తొలగించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సాంసంగ్ బ్రాండ్ అంబాసిడరే ఇలాంటి ప్రకటనే చేయడంలో అమ్మకాలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయ్. మరోవైపు, ప్రముఖ హెచ్ టీ సీ కంపెనీ..పుండు మీద కారం చల్లేలా మరో ట్వీట్ చేసింది. టాప్ ప్లేయర్లకు వరల్డ్ లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ లు అవసరం అంటూ ట్వీట్ చేసింది.
ప్రఖ్యాత డేవిడ్ బెక్ హామ్ చేసిన ఓ పని..ఫేమస్ హెయిర్ క్రీమ్ బ్రెయిల్ క్రీమ్ కు భారీ నష్టం చేకూరేలా చేసింది. 1997 లో బెక్ హామ్ తో నాలుగు ఏళ్ల పాటు ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, మనోడు..ఆ కాంట్రాక్ట్ ఒప్పందం అమల్లో ఉండగానే..గుండు చేయించుకుని బరిలోకి దిగాడు. ఇంకే ముంది..ఆ కంపెనీ కొన్ని కోట్ల కాంట్రాక్ బెక్ హామ్ తో క్యాన్సిల్ చేసుకుంది.