క్రిస్టియానో రొనాల్డో గతేడాది పేలవ ప్రదర్శన చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2022లో జట్టులో ఉన్నా పేలవ ఫామ్ కారణంగా బెంచ్ కే పరిమితం అయ్యాడు. మాంచెస్టర్ యునైటెడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం సౌదీ లీగ్ లో అల్ నసర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది మాత్రం రొనాల్డో మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. ప్రస్తుతం వచ్చే ఏడాది జరిగే యూరో కప్ 2023లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.