CRISTIANO RONALDO BROKE COVID RULES FOR HIS GIRL FRIEND GEORGINA RODRIGUEZS BIRTHDAY SRD
Cristiano Ronaldo : చిక్కుల్లో క్రిస్టియానో రొనాల్డో.. ప్రేయసి బర్త్ డే కోసం కొవిడ్ రూల్స్ బ్రేక్..
Cristiano Ronaldo : పోర్చుగల్ సాకర్ దిగ్గజం..లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అనవసరంగా చిక్కులు తెచ్చుకున్నాడు. తన ప్రేయసి జార్జీనా రోడ్రిగ్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కరోనా రూల్స్ బ్రేక్ చేశాడు.
పోర్చుగల్ సాకర్ దిగ్గజం..లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అనవసరంగా చిక్కులు తెచ్చుకున్నాడు. తన ప్రేయసి జార్జీనా రోడ్రిగ్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కరోనా రూల్స్ బ్రేక్ చేశాడు.
2/ 6
కోవిడ్ నిబంధనలను అతిక్రమించి..మౌంటెన్ రిసార్ట్ కి వెళ్లాడు రొనాల్డో. ప్రస్తుతం ఇటలీలో కరోనా ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్నాయి.
3/ 6
టురిన్ నగరంలో ఉంటున్న రొనాల్డో, రోడ్రిగ్స్... సిటీని వదిలి బయటికి వెళ్లడానికి వీల్లేదు. అయితే గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని భావించాలని రొనాల్డో... ఆమెతో కలిసి మంచులో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. దాదాపు 150 కిలో మీటర్లు ప్రయాణించి కౌర్మయుర్కి చేరుకున్నారు.
4/ 6
అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రోడ్రిగ్స్, కొద్దిసేపటికే వాటిని తొలగించింది. అయితే చాలా వెబ్సైట్లలో ఈ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. రొనాల్డో కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే.
5/ 6
ఇటీవలే క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో రికార్డుల మోత మోగించాడు. దీంతో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్ బాల్ ప్లేయర్ గా అవతరించాడు.
6/ 6
మాంచెస్టర్ యునైటెడ్ తరుపున 118, తన దేశమైన పోర్చుగల్ తరుపున 102, ప్రస్తుతం ఆడుతున్న జువీ క్లబ్ తరుపున 85, స్పోర్టింగ్ లిస్డన్ తరుపున ఐదు గోల్స్ సాధించాడు క్రిస్టియానో రొనాల్డో.