పోర్చుగల కెప్టెన్, స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ప్లేయర్ కూడా రొనాల్డోనే. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. ఇక అతడి కోసం బయట ఎంతో మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కాబట్టి అతడి భద్రత కూడా ముఖ్యమే. రొనాల్డోకు ఇద్దరు బాడీగార్డులు ఎప్పుడూ కాపలా ఉంటారు.
పోర్చుగల్‌కు చెందిన కవల సోదరులు సెర్జియో, జార్జ్ సైన్యంలో పని చేశారు. భద్రతాదళంలో భాగంగా అఫ్గానిస్తాన్‌లో కూడా పనిచేవారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రోనాల్డో, వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు.
రొనాల్డోతో పాటు తరుచూ బయటక కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్ లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు అత్యంత వేగంగా.. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు ఉన్నాయి. వీరు ప్రాణాలకు తెగించిమరీ తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారనే పేరున్నది. చాలా తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం.