ఈ రెండు నెలల్లో ఆరుగురు క్రికెటర్లు పెళ్లిలు చేసుకున్నారు. క్రికెటర్లకు సంబంధించిన పెళ్లి విషయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సాధారణంగా క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారిపోతుంది. ఇక ప్రేమ, పెళ్లి లాంటి విషయాలు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తో పాటు..పాకిస్తాన్ క్రికెటర్లు -షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్‌లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా పెళ్లి చేసుకున్నాడు. Photo from Twitter User Maaham Khan