Home » photogallery » sports »

CRICKETER ROHIT SHARMA CHILLS OUT WITH HIS WIFE RITIKA SHARMA AND FAMILY IN MALDHIVES PHOTOS VIRAL IN INSTAGRAM CR

ఆ దీవుల్లో భార్యతో ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ... రితికా స్టైల్‌కు ఇన్‌స్టా ఫ్యాన్స్‌కు ఫిదా...

ఐపీఎల్ 2019 సమరం ముగిసింది. రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్... అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ...నాలుగోసారి టోర్నీని ముద్దాడి, ఐపీఎల్ ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్న ఏకైక క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. రెండు నెలల పాటు మ్యాచులు, ప్రాక్టీస్ సెషన్స్‌తో యమ బిజీగా గడిపిన క్రికెటర్లు అందరూ ఇప్పుడు హాయిగా సేదతీరుతున్నాడు. ఛాంపియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన భార్య రితికా శర్మ, కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయాడు.