CRICKET WORLD TEST CHAMPIONSHIP RAHANE BUMRAH STAR AS INDIA THRASH WEST INDIES IN FIRST TEST BS
IND vs WI: బుమ్రా దెబ్బకు విండీస్ విలవిల.. టీమిండియా ఘన విజయం
IND vs WI: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగుల తేడాతో ఓడించింది. రహానె (102) సెంచరీతోపాటు బుమ్రా విజృంభించడంతో విక్టరీ టీమిండియా వశమైంది.
భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది.
భారీ లక్ష్య ఛేదనలో విండీస్ బుమ్రా దెబ్బకు వణికింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్(5 వికెట్లు) విజృంభించగా.. ఈసారి బుమ్రా వంతైంది.
6/ 6
కేవలం 7 పరుగులే ఇచ్చిన బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో విండీస్ పేక మేడలా కుప్ప కూలింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.