దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో గంటలపాటు క్రీజ్‌లో నిలిచిపోయే ఆటగాడు అతను.. టీమ్ కష్టాల్లో ఉంటే బ్యాట్‌తోనే కాదు.. బాడీతోనూ అడ్డుగోడగా నిలిచిన సందర్భాలున్నాయి. అతడిని అవుట్ చేయలేక ఆస్ట్రేలియా బౌలర్లు బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేసినా.. వెన్నుచూపని వీరుడతాను.. 13ఏళ్లుగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara).. ఇప్పుడు అరుదైన 100వ టెస్టు మైలురాయిని చేరుకుంటున్నాడు. Image Credit BCCI
2010లో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన పుజారా.. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనే అర్ధశతకం సాధించాడు. కెరీర్లో ఎత్తు పల్లాలు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. ఇప్పటివరకు 99మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 7,021 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 44.16గా ఉంది. Image Credit BCCI
అక్టోబర్ 9, 2005లో పుజారా 17ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వాళ్ల అమ్మ క్యాన్సర్‌తో చనిపోయారు.. సరిగ్గా అదే రోజు 5ఏళ్ల తర్వాత(2010 అక్టోబర్ 9న) పుజారా తొలి టెస్టు ఆడాడు. ఒకవైపు ఆనందం, మరోవైపు అమ్మను గుర్తు చేసుకుంటూ మ్యాచ్ బరిలోకి దిగిన పుజారా తొలి ఇన్నింగ్స్ 3 పరుగులకే పరిమితమైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్‌ను కాదని పుజారాను ధోని మూడో స్థానంలో పంపడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇక కీలక అర్ధసెంచరీతో అతను రాబోయే రోజుల గురించి సంకేతాలిచ్చాడు. Image Credit BCCI