Cricket Viral : ఇదేందయ్యా ఇదీ.. రెండంటే రెండే బంతుల్లో ముగిసిన మ్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
Cricket Viral : ఇదేందయ్యా ఇదీ.. రెండంటే రెండే బంతుల్లో ముగిసిన మ్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
Cricket Viral : అసోసియేషన్ దేశాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే ఆలౌటైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ ను దాటలేదు. ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ డకౌట్ గా వెనుదిరిగారు.
ఫిబ్రవరి 26న క్రికెట్ (Cricket) చరిత్రలోనే అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక టి20 మ్యాచ్ ఊకందని రీతిలో సాగింది. మళ్లీ ఇదొక అంతర్జాతీయ మ్యాచ్. స్పెయిన్, ఐజిల్ ఆఫ్ మ్యాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి. (PC : TWITTER)
2/ 6
అసోసియేషన్ దేశాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే ఆలౌటైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా డబుల్ డిజిట్ ను దాటలేదు. ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ డకౌట్ గా వెనుదిరిగారు. (PC : TWITTER)
3/ 6
ఇక ఈ జట్టులో టాప్ స్కోరు 4 పరుగులు కావడం విశేషం. ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ బౌలర్లలో మొహమ్మద్ కమ్రాన్, అతీఫ్ మొహమ్మద్ లు చెరో నాలుగు వికెట్లు సాధించారు. లోర్న్ బర్న్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. (PC : TWITTER)
4/ 6
అనంతరం ఛేదనకు దిగిన స్పెయిన్.. కేవలం 2 బంతుల్లోనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ తరఫున తొలి ఓవర్ ను జోసఫ్ బుర్రోస్ వేశాడు. తొలి బంతిని నో బాల్ గా వేశాడు. ఇక తర్వాతి రెండు బంతులను సిక్సర్లు బాదిన అవైస్ అహ్మద్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. (PC : TWITTER)
5/ 6
ఈ క్రమంలో పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ టి20ల్లో అత్యల్ప స్కోరు (10) రికార్డు ఐజిల్ ఆఫ్ మ్యాన్ పేరిట లిఖించబడింది. ఇక చేధనలో ఫాస్టెస్ట్ రన్ రేట్ (39) రికార్డు స్పెయిన్ ఖాతాలో చేరింది. (PC : TWITTER)
6/ 6
బంతుల పరంగా అతిపెద్ద ఓటమిని ఐజిల్ ఆఫ్ మ్యాన్ పేరిట లిఖించబడ్డది. 118 బంతుల తేడాతో ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఓడిపోయింది. బహుశా ఈ రికార్డులను ఎవరూ బద్దలు కొట్టలేరేమో. (PC : TWITTER)