ఈ వేలంలో భారతదేశంలోని చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ వేలంలో చాలా కార్లను వేలానికి ఉంచారు. అయితే.. క్లాసిక్ ల్యాండ్ రోవర్ 3 మీద మోజు పడ్డ ధోనీ.. రూ.25 లక్షలు చెల్లించి ఈ కారును దక్కించుకున్నట్టు బిగ్ బాయ్ టాయ్ జ్ సంస్థ తెలిపింది. ఈ వేలంలో 50 శాతంకు పైగా వింటేజ్ కార్లను సెలబ్రిటీలు కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఇక, ధోనీ దగ్గర చాలా వాహనాల కలెక్షన్ ఉంది. నాలుగు చక్రాల విషయానికి వస్తే ఫెరారీ 599 జిటిఓ, హమ్మర్ హెచ్ 2 మరియు జిఎంసి సియెర్రాతో సహా అనేక హై-ఎండ్ వాహనాలకు ధోని యజమాని. ద్విచక్ర వాహనాల్లో, కవాసాకి నింజా హెచ్ 2, కాన్ఫెడరేట్ హెల్కాట్, బిఎస్ఎ, సుజుకి హయాబుషా మరియు నార్టన్ వింటేజ్ వంటి కొన్ని గొప్ప బైకులు ఉన్నాయి.
ధోనీకి బైకులు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. క్రికెట్ లో ఎవరికి బహుమతిగా వచ్చినా మాహి పై విహరిస్తుంటాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాహికి ఓ రేసింగ్ టీమ్ కూడా ఉంది. ఇది సూపర్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ భాగంగా ఉంది. ఈ రేసింగ్ టీమ్ కి ధోనీతో పాటు కింగ్ అక్కినేని నాగార్జున సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.