CRICKET GOD SACHIN TENDULKAR RANKS 12TH IN MOST ADMRIED PEOPLE IN WORLD AND VIRAT KOHLI DHONI FOLLOWS MASTER SRD
Sachin Tendulkar : ఏంది సామీ నీ క్రేజ్.. క్రికెట్ కు గుడ్ బై చెప్పి 8 ఏళ్లు దాటినా సచిన్ తర్వాతే కోహ్లీ, షారుఖ్..
Sachin Tendulkar : క్రికెట్ రారాజు, క్రికెట్ దేవుడు.. ఇలా ఎన్నో ముద్దు పేర్లతో సచిన్ ను అభిమానులు పిల్చుకుంటారు. లిటిల్ మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, దాదాపు 8 ఏళ్లు దాటిపోయింది.
క్రికెట్(Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు. ఇక, భారతదేశం (India)లో ఈ జెంటిల్ మేన్ గేమ్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. భారత్ లో క్రికెట్ ఓ మతం. అది సీనియర్ లెవల్ అయినా, జూనియర్ క్రికెట్ అయినా విజయం సాధిస్తే ఓ రేంజిలో సంబరాలు చేస్తుంటారు.
2/ 9
క్రికెట్ ఒక మతం అయితే, ఇక.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ను క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు.
3/ 9
క్రికెట్ రారాజు, క్రికెట్ దేవుడు.. ఇలా ఎన్నో ముద్దు పేర్లతో సచిన్ ను అభిమానులు పిల్చుకుంటారు. లిటిల్ మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని, దాదాపు 8 ఏళ్లు దాటిపోయింది.
4/ 9
ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీల రూపంలో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. కానీ, సచిన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని లేటెస్ట్ గా ఓ సర్వే నిరూపించింది.
5/ 9
తాజాగా యూగోవ్ అనే ఇంటర్నెట్ మార్క్ రిసెర్చ్, డేటా అనాలిటిక్స్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో "మోస్ట్ అడ్మైర్డ్ మ్యాన్" గా ప్రపంచంలోనే 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు సచిన్ టెండూల్కర్.
6/ 9
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 38 దేశాల్లో ఉన్న వివిధ నగరాల నుంచి దాదాపు 42 వేల మంది అభిప్రాయాలను సేకరించి, ఈ సర్వే నిర్వహించింది యూగోవ్. ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత మూడో స్పోర్ట్స్ పర్సన్‌గా అత్యధిక ఓట్లు సాధించాడు లిటిల్ మాస్టర్.
7/ 9
సచిన్ తర్వాత క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ ఈ లిస్ట్ లో 18 వ స్థానం దక్కించుకున్నాడు.
8/ 9
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానాల్లో నిలవడం విశేషం.
9/ 9
ఈ అంతర్జాతీయ సర్వే ప్రకారం, నరేంద్ర మోడీ ప్రపంచంలోని 8వ అత్యంత ఆరాధించే వ్యక్తి, ప్రపంచ రాజకీయ నాయకుల కంటే అగ్రస్థానంలో ఉన్నారు.