ఐపీఎల్-2018లో అద్దిరిపోయే ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో హైదరాబాద్ జట్టును ఓడించి టైటిల్‌ను ఎగరేసు కుపోయింది. విన్నర్ చెన్నైకి 20 కోట్ల క్యాష్‌ప్రైజ్ అందగా.. రన్నరప్ హైదరాబాద్‌కు 12.5 కోట్ల క్యాష్ ప్రైజ్ దక్కింది. ఐతే ఆటగాళ్లతో పాటు ఈసారి బాగానే వెనకేసుకున్నారు. మరి ఐపీఎల్ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించే వారికి పారితోషికమెంతో తెలుసా? చెన్నై కోచ్ నుంచి పంజాబ్ కోచ్ వరకు ఎవరెవరికి ఎంత అందుతుందో ఇక్కడ చూడండి అందరి కంటే ముందుగా చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఆయన 3.2 కోట్ల మేర పారితోషికం అందుకున్నారు.   ఇక రన్నరప్ జట్టు హైదరాబాద్ కోచ్, మాజీ భారత క్రికెట్ జట్టు ఆటగాడు లక్ష్మణ్ పారితోషికం 2 కోట్లు. ఈ సారి మూడో స్థానంలో నిలిచిన కోల్‌కతా జట్టు కోచ్ కలిస్. ఐపీఎల్-11 టోర్నీలో ఆయన 2.25 కోట్లు సంపాదించాడు. నాలుగో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ షేన్ వార్న్. ఈ సీజన్లో వార్న్ పారితోషికం 2.7 కోట్లు. ముంబై ఇండియన్స్ కోచ్, మాజీ శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనే ఈసారి 2.25 కోట్లు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్ కొహ్లీ టీం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్‌స్టన్ 1.5 కోట్లు సంపాదించారు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మెంటర్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్ ఈ టోర్నీకి గాను 3 కోట్ల రూపాయలు అందుకున్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్. ఆయన పారితోషికం 3.7 కోట్లు