లేటెస్ట్ గా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) కరోనా బారిన పడ్డాడు. బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాక్స్‌వెల్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ప్రస్తుతం మాక్స్‌వెల్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో మాక్స్వెల్ చికిత్స తీసుకుంటున్నాడు.
పంజాబ్ కింగ్స్, ప్రీతి జింటా" width="1200" height="800" /> బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్వెల్ ఈ లీగ్ సందర్బంగానే వైరస్ బారిన పడ్డాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో మెల్బోర్న్ జట్టుకు మాక్స్వెల్ నాయకత్వం కూడా వహించాడు. ఆడిలైడ్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లోనే మాక్స్వెల్ కోవిడ్ బారిన పడి ఉంటాడని భావిస్తున్నారు.
అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన మెల్బోర్న్ జట్టులో 13వ వ్యక్తి మాక్స్వెల్. ఇప్పటికే ఆ జట్టులోని 8 మంది సహాయక సిబ్బందితోపాటు, నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంత భారీగా కరోనా కేసులు నమోదవడంతో బిగ్‌బాష్ లీగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా పాట్ కమిన్స్ కూడా కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందున రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో యాషెస్ సిరీస్‌లో, బిగ్‌బాష్ లీగ్‌లో కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా విజృంభణతో యాషెస్ సిరీస్ కూడా మధ్యలోనే ఆగిపోవాల్సిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.