ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics)లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. టోక్యో విశ్వక్రీడలపై కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరగా, వైరస్ బారిన పడిన అథ్లెట్ల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లింది.
రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కెండ్రిక్స్, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అయితే అతనితో కాంటాక్ట్ ఉన్న ఆస్ట్రేలియా అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే విశ్వక్రీడల్లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. (Photo Credit : AFP)
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వట్లేదు. కమిటీ అధికారికంగా నియమించుకున్న వాలంటీర్ల సంఖ్యను కూడా పరిమితం చేశారు అధికారులు. అలాగే- ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న 5,967 బెడ్స్ సంఖ్యను వచ్చే వారం నాటికి 6,406కు పెంచాలని అధికారులు నిర్ణయించారు.