టీ20 వరల్డ్ కప్ -2022 (T20 World Cup 2022) వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మట్టికరిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇండియా- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి విజయం సొంతం చేసుకోవడంపై జట్టుతో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.