ఇంగ్లీష్ కౌంటీ తాజా సీజన్ లో అక్కడి విఖ్యాత జట్టు సస్సెక్స్ తరఫున ఆడేందుకు పుజారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా డెర్బిషైర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పుజారా డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా వార్సెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ తో దానికి కొనసాగింపు అన్న రీతిలో మరో సూపర్ ఇన్నింగ్స్ తో పుజారా చెలరేగాడు.
[caption id="attachment_757438" align="alignnone" width="924"] ఇక ఇదే జట్టుకు ఆడుతున్న పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్ తొలి బంతికే గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అయితే వార్సెస్టర్ షైర్ తమ తొలి ఇన్నింగ్స్ లో 491 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా బ్యాటింగ్ చేపట్టిన సస్సెక్స్ 269 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.