BCCI : రూ. 14 కోట్ల ప్లేయర్ కు భారీ ఝలక్ ఇచ్చిన బీసీసీఐ.. అతడెవరో కాదు ధోని శిష్యుడే
BCCI : రూ. 14 కోట్ల ప్లేయర్ కు భారీ ఝలక్ ఇచ్చిన బీసీసీఐ.. అతడెవరో కాదు ధోని శిష్యుడే
BCCI : A+ ప్లేయర్లకు రూ. 7 కోట్లు.. A గ్రేడ్లో ఉన్న ప్లేయర్లకు రూ. 5 కోట్లు.. B గ్రేడ్ లో చోటు దక్కించుకున్న ప్లేయర్లకు రూ. 3 కోట్లు.. C గ్రేడ్ ప్లేయర్స్ కు రూ. 3 కోట్లను వార్షిక వేతనంగా బీసీసీఐ చెల్లించనుంది.
క్రికెట్ పెద్దన్న బీసీసీఐ (BCCI) వార్షిక కాంట్రాక్టును ప్రకటించింది. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు 26 మంది సభ్యులతో సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్లను A+, A, B, Cల కింద 4 గ్రేడ్లుగా వర్గీకరించింది.
2/ 7
A+ ప్లేయర్లకు రూ. 7 కోట్లు.. A గ్రేడ్లో ఉన్న ప్లేయర్లకు రూ. 5 కోట్లు.. B గ్రేడ్ లో చోటు దక్కించుకున్న ప్లేయర్లకు రూ. 3 కోట్లు.. C గ్రేడ్ ప్లేయర్స్ కు రూ. 3 కోట్లను వార్షిక వేతనంగా బీసీసీఐ చెల్లించనుంది.
3/ 7
గత కాంట్రాక్టులో A+లో కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే కొత్త కాంట్రాక్టులో ఈ ముగ్గురితో పాటు రవీంద్ర జడేజాకు ప్రమోషన్ ఇచ్చింది. మొత్తం మీద టాప్ గ్రేడ్ లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు కల్పించింది.
4/ 7
అయితే గత సెంట్రల్ కాంట్రాక్టులో ‘సి’ గ్రేడ్ లో చోటు దక్కించుకున్న భారత ప్లేయర్ దీపక్ చహర్ కు బీసీసీఐ భారీ ఝలక్ ఇచ్చింది. వార్షిక కాంట్రాక్టు నుంచి దీపక్ చహర్ ను తప్పించింది.
5/ 7
ధోని శిష్యుడిగా ఉన్న దీపక్ చహర్ కు ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యకరమే. గతేడాది మొత్తం గాయాల కారణంగా దీపక్ చహర్ అటు ఐపీఎల్ 2022కి ఇటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. పెద్దగా క్రికెట్ ఆడకపోవడంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది.
6/ 7
పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే దీపక్ చహర్ మళ్లీ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే టీమిండియా నుంచి మూడు ఫార్మాట్లలోనూ వేటుకు గురైన శిఖర్ ధావన్ ‘సి’ గ్రేడ్ లో చోటు దక్కించుకోవడం విశేషం.
7/ 7
దీపక్ చహర్ ను రూ. 14 కోట్లకు 2022లో జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అయితే వెన్ను గాయంతో అతడు ఐపీఎల్ 15వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న అతడు ఐపీఎల్ 16వ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు.