ఈ వివరాలపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రియాజ్ బాగ్బన్ మాట్లాడుతూ... " రాహుల్ త్రిపాఠి, సిద్దేశ్ వీర్, రాజ్వర్ధన్ స్థానాలను స్వప్నిల్ గుగాలే, పవన్ షా, జగదీశ్ జోపేతో భర్తీ చేశాం. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన త్రిపాఠి గాయం నుంచి కోలుకోకపోవడంతో నౌషద్ షేక్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడు " అని పేర్కొన్నారు.
ఇక, చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో సారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టీ-20 వరల్డ్ కప్ తర్వాత కివీస్ తో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు ఈ యంగ్ క్రికెటర్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ్. మెగాటోర్నీ తర్వాత పలువురు స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.